మీకు షుగరా? ఇది తినండి!

20-11-2017: ఉడికించిన బార్లీ గింజలు బియ్యం గింజల లానే కనిపిస్తాయి. రూపంలోనే కాదు పోషకాలలోనూ ఇది సాటి లేనిదే. బార్లీ గింజలు బియ్యానికి మంచి ప్రత్యామ్నాయ ఆహారం కూడా. అందుకే దీన్ని తృణధాన్యాల్లో రాజు అంటారు. బియ్యంలో కన్నా 9 రెట్లు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులకు ఇది మంచి అల్పాహారం. ఓట్స్‌ వంటి వంటకాల కన్నా బార్లీ గింజలతో ఇడ్లీ చేసుకుంటే ఎంతో మేలు.

 
కావలసిన పదార్థాలు
బార్లీ గింజలు - అర కప్పు, ఉప్పుడు బియ్యం - కప్పు, మినుములు - అరకప్పు, మెంతులు- పావు స్పూన్‌, ఉప్పు - తగినంత, తరిగి, ఉడికించిన క్యారెట్‌, చిక్కుడు ముక్కలు - అరకప్పు.
 
బార్లీ గింజలతో ఇడ్లీ చేసే చేసే విధానం
మెంతులు, మినపపప్పు, ఉప్పుడు బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టిలి. తరువాత వీటికి బార్లీ గింజలు, తగినంత నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
పిండిని వేరే పాత్రలో వేసి ఉప్ప్ప వేసి కలిసేలా తిప్పాలి. పిండి పులిసేందుకు నాలుగు గంటలు నిల్వ ఉంచాలి. తరువాత పిండిని బాగా కలపాలి.  ఇడ్లీ రేకులు తీసుకొని కొంచెం నెయ్యి రాసి పిండి వేసుకోవాలి. తరిగిన కూరగాయ ముక్కలను పైన వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి తగు సమయం వరకు ఉడికించాలి.  పొయ్యి మీద నుంచి దించి వేడి వేడి సాంబార్‌తో కలిపి వడ్డించండి.  బార్లీ బ్యియంతో చేసిన ఆరు ఇడ్లీల ద్వారా 35 క్యాలరీలు, 1.3 గ్రా. మాంసకృత్తులు, 7.4 గ్రా. కార్బోహైడ్రేడ్స్‌, 0.1 గ్రా. కొవ్వు, 0..6 గ్రా. పీచు లభిస్తాయి.