మౌత్‌వాష్‌తో మధుమేహం

24-11-2017: నోరు దుర్వాసన పోగొట్టుకోవడానికి మౌత్‌వాష్  వాడుతుంటారు. అయితే, దాని వల్ల టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు సార్లు మౌత్‌వాష్ వాడితే మూడేళ్లలో మధుమేహం వచ్చే అవకాశం 55శాతం ఎక్కువ అవుతుందని అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. మౌత్‌వా్‌షలో ఉండే పదార్థాలు నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా హరించడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుందని వివరించారు.