ఒంటరితనంతో మధుమేహం?

10-01-2018: ఒంటరితనం అనేది పలు రుగ్మతలకు కారణం అవుతుందన్న సంగతి తెలిసిందే! ఇది ఇప్పుడు టైప్‌–2 డయాబెటిస్‌ రావడానికి దోహదం చేస్తుందన్న విషయం లండన్‌లో నిర్వహించినన ఓ అధ్యయనంలో వెల్లడైంది. నలుగురితో కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారిలో టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం 42 శాతం ఉందని అధ్యయన కారులు అంటున్నారు. అందరితో కలిసి ఉండేవారిలో ఇది రాదు అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయడంలేదు. స్త్రీలతో పోల్చుకుంటే ఒంటరిగా ఉండే పురుషులకే ఈ టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. నలుగురితో కలిసి ఉండడం వలన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వారు సూచిస్తున్నారు.