బాలికల్లో టైప్‌2 షుగర్‌తో పీరియడ్స్‌పై ప్రభావం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 26: టైప్‌ 2 షుగర్‌ ఉన్న బాలికలు, యువతుల్లో పీరియడ్స్‌ క్రమం తప్పుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఊబకాయంతో బాధపడే మహిళల్లో ఈ ఇబ్బంది మామూలేనని అయితే, ఇలాంటి వారు షుగర్‌ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో పరిశోధకులు తెలిపారు.