హైపోగ్లైసీమియాను గుర్తించే పరికరం

23-08-2017: మధుమేహంతో బాధపడే కొంతమందికి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిపోతున్నాయా(హైపోగ్లైసీమియా).. లేదా.. అన్న విషయం సరిగా తెలీదు. ఒకవేళ చక్కెర తగ్గితే వెంటనే నీరసం, చెమటలు పట్టడం, గుండె దడ, తల తిప్పడం, కోమాలోకి వెళ్లడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే వారికోసం చక్కెర శాతం ప్రమాద స్థాయికి తగ్గడాన్ని గుర్తించే పరికరాన్ని అ మెరికాలోని కైజర్‌ పర్మనెంట్‌ డడివిజన్‌ ఆఫ్‌ రీసె ర్చ్‌ శాస్త్రవేత్తలు తయారు చేశారు. పరికరంతో పరీక్షించాక చక్కెర శాతం తగ్గుతుందని తెలీగానే సరైన చికిత్స చేయించుకోవడానికి ఉపకరిస్తుందన్నారు.