ఒమెగా-6 కొవ్వులతో మధుమేహానికి చెక్‌!

13-10-2017: ఒమెగా-6 పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉండే సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, పప్పులు ఎక్కువగా తింటే మధుమేహం వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుందట. ఆస్ట్రేలియాకు చెందిన ‘ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు తాము చెప్పిన విధంగా ఆహారంలో ఒమెగా-6 కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలను భాగం చేసుకుంటే షుగర్‌ వచ్చే ముప్పును తగ్గించవచ్చని ఈ అధ్యయనం నిర్వహించిన జాసన్‌ వు తెలిపారు.