మధుమేహానికి చెక్‌ !

04-09-2018: బెండకాయలో పీచు అధికంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి డైట్‌ అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌, అంజు సూద్‌.
బెండలో పీచు అధికంగా ఉంటుంది. బెండకాయ తినడం వల్ల శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.
వీటిలో విటమిన్‌ బి ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు కారణమయ్యే హోమోసిస్టీన్‌ అనే అమైనో ఆమ్లం నిల్వలను తగ్గిస్తుంది.
వీటిలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
బెండలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
శరీరంలో కార్బోహైడ్రేట్లను ముక్కలు చేసే ఎంజైమ్‌లను బెండకాయ నియంత్రిస్తుంది. క్లోమంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది.