మధుమేహులూ కళ్లు జాగ్రత్త!

26-11-2018: మధుమేహం శరీరంలోని ఏ భాగాన్నీ వదిలిపెట్టదు. కాకపోతే, అన్నింటికన్నా సున్నితమైనవి కళ్లు కాబట్టి, వాటి విషయంలో మరింత జాగ్రత్త పడాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని...
అతి సాధారణమైనది, అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తంలోని షుగర్‌ నిల్వలను నియంత్రణలో ఉంచుకోవడం.
తరుచూ డయాబెటిక్‌ రెటినోపతి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా చేయిస్తే సమస్యను ఆదిలోనే గుర్తించడం సాధ్యమవుతుంది,
ఎంతసేపూ మధుమేహం దగ్గరే ఆగిపోకుండా, దానితోపాటే ఉండే అధిక రక్తపోటు, డిస్‌లిపిడేమియా, అనీమియా, ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా వంటి ఇతర వ్యాధుల నియంత్రణ విషయంలో కూడా జాగ్రత్తపడాలి.
మధుమేహం కారణంగా కిడ్నీలు దెబ్బ తిన్నవారిలో దృష్టిలోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు, డయాబెటిక్‌ రెటినోపతి , ప్రొటీనూరియా వ్యాధులను స్ర్కీనింగ్‌ ద్వారా ఎప్పటికప్పడు తెలుసుకుంటూ ఉండాలి.
డయాబెటిక్‌ న్యూరోపతికి ఆయా దశను బట్టి చికిత్స ఉంటుంది, మ్యాకులర్‌ ఎడీమా ఉంటే కొన్ని రకాల ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కళ్లు పొడిబారుతుంటే, చుక్కల మందు అవసరమవుతుంది. క్యాటరాక్ట్‌ సమస్య తీవ్రంగా ఉంటే, సర్జరీ అవసరం కూడా ఉండవచ్చు.