పంటిపోటు మటుమాయం
28-06-2017:పిడికెడు ఉత్తరేణి ముదురాకులు తీసుకుని రసం తీసి, కొంచెం సారాయి కలిపి, పంటి నొప్పి ఏ వైపున ఉంటే ఆ వైపు చెవిలో వేసుకుని ఎండలో 10 నిమిషాలు పడుకుంటే, పుచ్చిన దంతంలోని క్రిములు మెల్లమెల్లగా బురబురమంటూ చెవిలోంచి బయటికి వస్తాయి.
కాసిన్ని పల్పరి చిగుళ్లు, తులసి పత్రాలు, కాస్తంత కాచు, ఉప్పు కలిపి మెత్తగా దంచి చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. వాటిలోంచి ఒక ముద్దను పుచ్చిన పంటిని అంటుకుని దవడకు ఉండేలా పెట్టుకోవాలి. అలా అరంట సేపు తలవంచుకుని కూర్చుంటే నోటి నుంచి ద్రవం కారుతుంది. దీంతో క్రిములు నశించడమే కాకుండా నొప్పి శాశ్వతంగా దూరమవుతుంది. అయితే నోటిలో ఉంచుకున్న ముద్ద వల్ల కాస్త మంటగా అనిపించినా తీసివేయకూడదు. పది నిమిషాలకే మంట చల్లపడుతుంది.
చెట్టుమీదే ఎండిన రామ్ములక్కాయల్ని సంగ్రహించి, వాటి విత్తనాలను భద్రపరుచుకోవాలి. పిప్పిపళ్లతో విపరీతంగా బాధపడేవారికి ఇలా చేయాలి. నిప్పులపై మైలతుత్తం పొడిని, ములక్కాయ విత్తనాల్ని కలిపి వేస్తే ఘాటైన పొగ వస్తుంది. కళ్లు మూసుకుని ఆ పొగను నోటిలోకి పీల్చి బంధిస్తే, వెంటనే పంటి రంధ్రాల్లోంచి క్రిములు రాలిపడతాయి. దీంతో నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.