దంతాల అనారోగ్యం మరణానికి సూచన?!

న్యూయార్క్‌,31-3-2017: దంతాల ఆరోగ్యం మీ జీవితకాలాన్ని సూచిస్తుందా అంటే.. శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళలు చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నా, దంతాలు ఊడిపోతున్నా.. వారు మరణించే ప్రమాదం పెరుగుతుందట! ఈమేరకు 55 ఏళ్లు, ఆపై వయసున్న 57 వేల మంది మహిళలపై ఆరున్నర సంవత్సరాలపాటు పరిశోధించి ఈ విషయం కనుగొన్నట్లు బఫెలో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఇందులో చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్న మహిళలు మరణించే ప్రమాదం 12 శాతం, దంతాలు ఊడిపోతున్న వారిలో ఈ ముప్పు 17 శాతం ఉందని వారు తెలిపారు. అయితే, వీరి మరణానికి కారణం మాత్రం కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ఏదో ఒక వ్యాధితో వారు చనిపోయే అవకాశం ఉందని మైకెల్‌ జే లామనోట్‌ వివరించారు.