దంత సంరక్షణపై అవగాహనకు పోర్టల్‌

న్యూఢిల్లీ, మార్చి 20: దంతాలు, నోటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని ప్రారంభించింది. దీంతోపాటు ఇన్ఫర్‌మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌(ఐఈసీ) పేరుతో మెటీరియల్‌నూ విడుదల చేసింది. నోరు, దంతాల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో వివరించారు. ప్రజారోగ్యంపైనే దేశ సమగ్ర అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, పలు కార్యక్రమాలనూ చేపట్టిందని ఆయన తెలిపారు. దంత సంరక్షణ విషయంలో ప్రజలలో అవగాహన పెరగడం శుభ పరిణామమని అన్నారు. కాగా, మారుతున్న జీవనశైలి, పొగాకు, ఆల్కహాల్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోతుండడంతో నోటి సంరక్షణపై ఆందోళన వ్యక్తమవుతోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి సీకే మిశ్రా పేర్కొన్నారు.