పసుపు, బొగ్గుతో పళ్లు తళతళ!

ఆంధ్రజ్యోతి12-01-2017:  బొగ్గు లేదా కచ్చిక (ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చగా వచ్చే పొడి)తో పళ్లు తోముకోవడం పల్లెల్లో ఒకప్పుడు సర్వసాధారణం. కానీ.. పాశ్చాత్యదేశాల్లో మాత్రం ఇప్పుడు ఇదో కొత్త ట్రెండుగా ఆదరణ పొందుతోంది. బొగ్గుతోపాటు పసుపుతో కూడా పళ్లు తోముకుంటున్నారు. టూతబ్ర్‌షను నీళ్లలో బాగా కడిగి చిటికెడు పసుపు వేసి పళ్లను శుభ్రంగా తోముతారు. ఆ పసుపు కడగకుండా 3 నుంచి 5 నిమిషాల సేపు ఉండి ఆ తర్వాత కడుక్కుని, మళ్లీ టూతపేస్టుతో తోముతారు. ఇలా చేస్తే కొన్ని రోజుల వ్యవధిలోనే తేడా తెలుస్తుందని ఇప్పటికే తోముకుంటున్నవారు చెబుతున్నారు. ఇలాగే బొగ్గుతోనూ పళ్లు తెల్లగా అవుతాయంటున్నారు. ఈ క్రమంలోనే 2017లో బొగ్గు ఆధారిత పేస్టులు మార్కెట్‌లో విస్తృతంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాలం మళ్లీ వెనక్కి వెళ్తున్నట్టు అనిపించట్లేదూ..!?