దంతాలకు హాని చేయని ‘క్లియర్‌ కాఫీ’!

లండన్‌, ఏప్రిల్‌ 19: ఆ ఇద్దరు సోదరులకు కాఫీ అంటే అమిత ఇష్టం. దాని బానిసలైపోయారు. కానీ, కాఫీ వల్ల దంతాల రంగు మారడం వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ఆ ఇద్దరు సరికొత్త ‘క్లియర్‌ కాఫీ’ని తయారు చేశారు. లండన్‌లో నివసిస్తున్న... స్లొవేకియాకు చెందిన ఈ సోదరులు డేవిడ్‌, ఆడమ్‌ నేగీ తయారుచేసిన ఈ కాఫీ చూడడానికి అచ్చు నీటిని పోలి ఉంటుంది. రుచి కూడా సరికొత్తగా ఉంటుందట! అయితే దీనిని తాగేవారికి దంత సమస్యల బాధ ఉండదని వారు చెబుతున్నారు. 200 మిల్లీలీటర్ల సీసాల్లో నింపి విక్రయిస్తున్న ఈ క్లియర్‌ కాఫీ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. వంద మిల్లీ గ్రాముల కెఫీన్‌ను కలిగి ఉండే ఈ సీసా సుమారు రూ.500కు లభిస్తుంది.