గర్భిణీలు చక్కెర ఎక్కువగా తీసుకుంటే..!

7-7-2017: గర్భిణీలు చక్కెర ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే పిల్లలకు అలర్జీ, ఆస్తమా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణి తీసుకునే సుగర్‌ పరిమాణం పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనే దిశగా యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్‌ మేరీ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. ఇందులో గర్భిణీ సుగర్‌ ఎక్కువగా తీసుకోవడం శిశువులకు హానికరమేనని తేలింది. దీనివల్ల శిశువు అలర్జీలు, ఆస్తమా బారినపడే ప్రమాదం పెరుగుతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.