చిన్నతనంలో రజస్వల అయితే..గర్భం దాల్చాక మధుమేహం

మార్చి 7,ఆంధ్రజ్యోతి: చిన్న వయసులోనే రజస్వల అయిన యువతులలో దాదాపు సగం మంది పెద్దయ్యాక జెస్టేషనల్‌ డయాబెటి్‌స(గర్భం దాల్చిన సమయంలో వచ్చే మధుమేహం) బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం! ఇటీవలి కాలంలో జెస్టేషనల్‌ డయాబెటిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోందని వారు తెలిపారు. ఈ మధుమేహం వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. కాగా, సుమారు 4.7 వేల మంది మహిళలను ప్రశ్నించగా.. 11 ఏళ్ల వయసులో రజస్వల అయ్యామని చెప్పిన మహిళలల్లో 50 శాతం మంది తర్వాతి కాలంలో ఈ మధుమేహం బారిన పడ్డారని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ పరిశోధకురాలు డేనియెల్లి స్కోయెనేకర్‌ వివరించారు.