మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న దుస్తులు

లండన్‌, 19-03-2017: ఒంటికి అతుక్కుపోయినట్లుండే జీన్స్‌ వేసుకోవడంవల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే, బాగా బరువున్న హ్యాండ్‌ బ్యాగ్‌, ఎత్తు మడమల చెప్పులతోనూ ఇబ్బంది తప్పదని సూచించారు. మరీ బిగుతుగా ఉండే జీన్స్‌ శరీర కండరాల కదలికలను అడ్డుకుంటుందని బ్రిటీష్‌ చిరోప్రాక్టిక్‌ అసోసియేషన్‌(బీసీఏ) పరిశోధకులు తెలిపారు. స్టైల్‌, ఫ్యాషన్‌ పేరుతో ఇలాంటి జీన్స్‌ వేసుకుంటే వెన్నునొప్పి వచ్చే ప్రమా దం ఉందన్నారు. మరీ ఎక్కువగా ఆభరణాలను ధరించడంవల్ల వాటి బరువుకు మెడ కండరాలు దెబ్బతిని, ఆకారం మారుతుందని వారు తెలిపారు.