గర్భిణీలు నాన్‌వెజ్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

04-09-2017: గర్భిణీలు అతిగా నాన్‌వెజ్‌ తినకూడదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. దీనివల్ల బిడ్డకు గర్భంలోనే మనోవైకల్యం కలిగే అవకాశాలుంటాయంటున్నారు. అమినో ఆసిడ్‌ అంటే methionine రక్తనాళాల వృద్ధికి, కణాల అభివృద్దికి, లివర్‌, గుండె నాళాల్లో ఉండే ఫ్యాట్‌ బ్రేక్‌ చేయడానికి, టిష్యూ రిపేర్‌ చేయడానికి శరీరానికి అత్యవసరం. గొర్రెమాంసం, పందిమాంసం, చికెన్‌, బీఫ్‌, నట్స్‌, డైరీప్రోడక్ట్స్‌, చీజ్‌, బీన్స్‌లో ఇది ఓవర్‌ లోడై ఉంటుంది. వీటిని గర్భిణీలు ఎక్కువ తినకూడదు. ఈ ఆహారం గర్భస్థశిశువు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనవేత్త Amal Alachkar కనుగొన్నారు. ప్రాథమికంగా ఎలుకలపై జరిపిన ఈ పరిశోధనల్ని ఇంకా క్షుణ్ణంగా చేస్తున్నట్టు చెప్పారు. స్కిజోఫ్రోనియా తీవ్రమైన దీర్ఘకాలిక మనోవైకల్యం. దీనిబారినపడినవారు ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటారు. భ్రాంతికి గురవుతారు. వాస్తవాన్ని గుర్తించలేరు. యాంటీ స్ర్కిజోఫ్రోనియా ఔషధాల తయారీకోసమే ఈ పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.