మండే ఎండలతో గర్భిణీలకు మధుమేహం?

టొరంటో, మే 15: ఉష్ణోగ్రతల్లో మార్పులు గర్భిణీ ల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే జెస్టేషనల్‌ డ యాబెటి్‌స(గర్భిణీలకు వచ్చే మధుమేహం) ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలిందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని సెయింట్‌ మైఖెల్‌ ఆస్పత్రిలో 5 లక్షలకుపైగా జననాలను, దాదాపు 4 లక్షల మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. కొందరు సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు గర్భం దాల్చగా.. మిగతా వారు తక్కువగా ఉన్నపుడు గర్భం దాల్చారు.