బిడ్డకు పాలిస్తే.. సిజేరియన్‌ నొప్పుల నుంచి విముక్తి!

లండన్‌, జూన్‌ 4: పిల్లలకు పాలివ్వడం ద్వారా సిజేరియన్‌ తాలుకూ నొప్పుల తీవ్రతను తగ్గించుకోవచ్చంటూ మాతృమూర్తులకు నిపుణులు సూచిస్తు న్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన నొప్పులు మహిళలను చాలాకాలం పాటు బాధిస్తాయని వైద్యులు తెలిపారు. అయితే, తమ చిన్నారులకు రెండు నెలలకన్నా ఎక్కువ కాలం పాలివ్వడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చట! ఈమేరకు స్పెయిన్‌ పరిశోధకులు సిజేరియన్‌తో బిడ్డకు జన్మనిచ్చిన 185 మంది మహిళలను ప్రశ్నించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 87శాతం మంది తల్లులు తమ చిన్నారులకు పాలివ్వగా.. మిగతా వారు రెండు నెలలలోపే పాలివ్వడం మానేసారు. ఈ అధ్యయనంలో తల్లుల వయసు, చదువు, హోదా తదితర విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నారు.