బాలింతల్లో పాలవృద్ధికి..

27-07-2017:

తల్లిపాలు అందనంత మాత్రాన బిడ్డకు డబ్బా పాలు తాగించే ప్రయత్నాలో పడకూడదు. కొద్ది పాటి గృహవైద్యం చిట్కాలతోనే పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవచ్చు. తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడమే కాదు. మొత్తం జీవితకాలానికి సరిపడే వ్యాధి నిరోధక శక్తికి పునాది వేస్తుంది. అలాంటి చిట్కాల్లో కొన్ని...

 
నేల గుమ్మడి వేరును కత్తితో మెత్తగా నరికి, ఎండబెట్టి చూర్ణం చేసి, గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడు 3 చెంచాల చూర్ణాన్ని పావులీటరు పాలలో ఉడికించి, తగినంత పంచదార కలపాలి. ఈ ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం తాగితే కావలసినన్ని పాలుపడతాయి. అయితే, పాలు, పండ్లు, నేయి వాడడం మానుకోకూడదు.
అశ్వగంధ (పెన్నేరు) గడ్డను చూర్ణించి, అందులో సగభాగం మోడి చూర్ణం కలిపి పాలలో ఉడికించాలి. బాగా మరిగే సమయాన ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసి దించి పంచదార, కొంచెం నేయి కలిపాలి. ఈ ద్రావణాన్ని ఉదయం పరకడుపున ఒక గ్లాసు, రాత్రి భోజనం చేసి పడుకునే ముందు కాస్త వెచ్చ చేసి మరో గ్లాసు తీసుకోవాలి. ఇలా చేస్తే వారం, పది రోజుల్లోనే క్షీర దోసాలన్నీ తొలగి, బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయి.