రుతుస్రావ అంశాల్లో మౌనం వద్దు

పరిష్కారానికి నడుంబిగించిన ఇద్దరు విద్యార్థినులు 

‘‘ప్రాజెక్ట్‌ సశక్త్‌’’ పేరుతో శానిటరీ నాప్‌కిన్ల పంపిణీ
 
న్యూఢిల్లీ,మార్చి 7:రుతుస్రావానికి సంబంధించి అవగాహన లోపంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి చదువుమానేస్తున్న విద్యార్థినుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇద్దరు విద్యార్థులు నడుంబిగించారు. ఇందుకోసం మౌల్‌సరిలోని శ్రీరామ్‌ స్కూల్‌కు చెందిన శరణ్యాదాస్‌ శర్మ, ఆమియా విశ్వనాఽథన్‌ ‘‘ప్రాజెక్ట్‌ సశక్త్‌’’ను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన బాలికలకు సేంద్రీయ వ్యర్థాలతో రూపొందించిన శానిటరీ నాప్‌కిన్లను అందజేస్తారు. తద్వారా ఆయా వర్గాల్లో పెరిగిపోతున్న రుతుస్రావ సంబంధిత సమస్యను పరిష్కరించనున్నారు. ‘‘చాలా మంది కనీస అవసరాల కోసం ఖర్చుపెట్టే సామర్థ్యంలేక పాఠశాలల్లో అలాంటి వసతులు లేకపోవడంతో ఆ సమయంలో చదువు మానేస్తున్నారు’’ అని శరణ్య చెప్పారు. గత ఏడాది సెప్టెంబరులో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. శరణ్య, ఆమియా ఇప్పటికే పలు స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి ఽఢిల్లీలోని ఎర్త్‌ సేవియర్‌ ్స గురుకుల్‌, నిర్మల్‌ సేవా స్కూల్‌లో శానిటరీ ప్యాడ్స్‌ అందిస్తున్నారు.