పిల్లలకు వీటిని ఇవ్వడం మరిచిపోకండి

21-6-2017: ఏడాది లోపు పిల్లలకు ఇచ్చే ఆహారంలో తల్లులు చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. వారికి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే ఇస్తారు. ఆ క్రమంలో కొందరు పాలను ఇవ్వడం కూడా మానేస్తారు. పాలు సంపూర్ణపోషకాహారమని తెలిసినా రకరకాల కారణాలు చూపిస్తూ పాల పరిమాణాన్ని తగ్గించేస్తారు. అంతే కాకుండా గుడ్లు, వేరుశనగపప్పులు వంటి వాటిని పిల్లలకు జీర్ణం కాదన్న అపోహ చాలామంది తల్లులకు ఉంటుంది. ఇది తప్పుడు అభిప్రాయం అంటున్నారు అమెరికా పరిశోధకులు. పిల్లలకు ఆరు నెలల వయస్సు నుంచే పాలతో పాటుగా గుడ్లు, వేరుశనగపప్పు వంటి వి ఇవ్వడం వలన వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ, ఆస్తమా వంటి ఎలర్జీలు వారిని చుట్టుముట్టవని అంటున్నారు. ఆరు నెలలలోపు పిల్లలకు కూడా వీటిని ఇవ్వవచ్చని వారు చెబుతున్నారు. కొన్ని మూఢనమ్మకాలతో తల్లులే పిల్లలని అనారోగ్యానికి దగ్గర చేస్తున్నారన్నది వారి వాదన.