డిజిటల్‌ లైఫ్‌తో జాగ్రత్త!

25-07-2017:డిజిటల్‌ లైఫ్‌ పిల్లలకూ బాగా ఇష్టం. ఆ మాటకొస్తే సార్ట్‌ఫోన్‌ను ఇష్టపడని పిల్లలుండరేమో! ఓ సర్వే ప్రకారం సగటున ఆరుగంటల పాటు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, టీవీలు, కంప్యూటర్లను పిల్లలు చూస్తున్నారట. ఇలా చేయడం వల్ల పిల్లలు వారి కంటి రెప్పల్ని ఎక్కువగా ఆడించటం, కళ్లు ఎర్రబడటం, పొడిబారటం జరుగుతోంది. ఈ లక్షణాలు పిల్లల్లో ఉంటే ఇబ్బందే. సాధ్యమైనంత వరకూ ఈ విషయంలో పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రిపుల్‌ 20 విధానాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. అదెలాగంటే ప్రతీ 20 నిమిషాలకోసారి 20 సెకండ్ల పాటు స్ర్కీన్‌ని చూడకుండా ఉండాలి. 20 మీటర్ల దూరంలో ఉండే వస్తువును చూడాలి. ఇలా కనీసం అరగంటకోసారైనా చేస్తుంటే కళ్లు ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి. ఈ టెక్నిక్‌ పెద్దలకూ వర్తిస్తుంది. మొత్తానికి ఫోన్లు, ల్యాపీలు కాకుండా అవుట్‌డోర్‌ గేమ్స్‌పై పిల్లలకు ఆసక్తి కల్పించాలి.