ఆస్తమా ఉన్న పిల్లలకు యుక్త వయసులో హృద్రోగ సమస్యలు!

28-6-2017: చిన్నతనం నుంచి ఆస్తమాతో బాధపడుతున్నవారికి పెద్దయ్యాక హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యాధి వల్ల యుక్త వయసులో ఊపిరి ఆడకపోవడం, ఛాతి నొప్పి, సొమ్మసిల్లుట వంటి సమస్యలు వస్తాయని, వీటివల్ల గుండె పనిచేయకపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దశాబ్దకాలంగా ఆస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో 8.6% మందికి, పెద్దల్లో 7.4 %  మందికి అస్తమా ఉన్నట్టు అంచనా వేశారు. అమెరికాలోని టులానె వర్సిటీకి చెందిన పరిశోధకులు 1118 మంది ఆస్తమా రోగులను పరీక్షించి ఈ నివేదిక రూపొందించారు.