బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం లేదా?

22-08-2017: బడికి ఆలస్యమవుతుందనో, తినడం ఇష్టంలేకో పిల్లలు బ్రేక్‌ఫా్‌స్టని చాలాసార్లు ఎగ్గొట్టేస్తుంటారు. అలా అసలు చేయొద్దంటున్నారు అధ్యయనకారులు. బ్రేక్‌ఫాస్ట్‌ క్రమం తప్పకుండా తీసుకునే పిల్లల్లో పోషకవిలువలు బాగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌ నిర్లక్ష్యం చేసే పిల్లల్లో పోషకవిలువలు సరిపడా ఉండవు. ఉదయం 7 నుంచి 9 గంటల లోపు బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం మంచిదని పరిశోధకులు తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌ సరిగా తినని పిల్లల్లో ఐరన్‌ పోషకాలు సిఫారసు చేసిన దాని కన్నా తక్కువ ఉంటున్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే పిల్లల్లో కన్నా తీసుకోని వారిలో ఐరన్‌ కూడా తక్కువ పరిమాణంలో ఉంటోంది.
 
క్యాల్షియం విషయంలో 19 శాతం మంది పిల్లల్లో సిఫారసు చేసిన దాని కన్నా తక్కువగా ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. 21.5 శాతం మంది పిల్లల్లో అయోడిన్‌ శాతం తక్కువగా ఉందని గుర్తించారు. చిన్నతనంలోనే పిల్లల ఆహారపు అలవాట్లను తల్లితండ్రులు నియంత్రించడం కూడా ఈ పరిస్థితికి కారణం అంటున్నారు అధ్యయనకారులు. ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ తింటున్న పిల్లలందరూ.. మంచి వేతనాలు వచ్చే కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం. మొత్తానికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ పిల్లలకు తప్పకుండా పెట్టాలి. లేకపోతే వారిలో పోషక విలువలు తగ్గి రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు చిన్నారుల్లో రోగనిరోధకశక్తి లోపిస్తుంది.