ఆస్తమా పిల్లలు పార్కుల వద్ద ఉంటే మేలు

10-09-2017: పార్కులు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఆస్తమాతో ఇబ్బందిపడే పిల్లల్ని ఉంచితే వ్యాధి ప్రమాదం తగ్గే అవకాశాలున్నాయని అమెరికాలోని జాన్స్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటికి, పార్కులకు 305 మీటర్ల కంటే తక్కువ దూ రం ఉంటే మేలని సూచిస్తున్నారు. పచ్చని వాతావరణం ఉండే ప్రదేశాల్లో పిల్లలు ఉంటే రోగం అంతగా ఇబ్బంది పెట్టనట్లు తమ పరిశోధనల్లో తేలిందని వెల్లడించారు.