పిల్లలు ఇష్టపడి చదవాలంటే...

02-11-2017:చదువు పట్ల పిల్లలకు ఉన్న అనవసరపు భయాలు, ఆందోళనలు తొలగించి, తోడ్పాటును అందించాలి. ఇందుకోసం...

పిల్లలు ఏదైనా సబ్జెక్ట్‌ మీద అనాసక్తి చూపిస్తుంటే కారణాన్ని అడిగి తెలుసుకోవాలి. పాఠం అర్థం కాలేదా? లేక ఏకాగ్రతగా వినట్లేదా? అనే విషయాన్ని గ్రహించి పొరపాటును సరిదిద్దాలి.

అర్థం కాని ప్రశ్నను అడిగి తెలుసుకునే చొరవ ఇస్తే, చదువులో సాయం కోసం తల్లితండ్రులను ఆశ్రయిస్తారు.

బాగా చదివే పిల్లలతో పోల్చి ఆత్మన్యూనతకు గురిచేయటం మాని, ‘శ్రద్ధగా చదివితే నువ్వూ మంచి మార్కులు తెచ్చుకోగలవు’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మాట్లాడాలి.

ఏ రోజైనా పిల్లలు ‘ఈ ఒక్కరోజూ ఆడుకుంటానమ్మా! చదవాలనిపించట్లేదు’ అంటే...ఒకసారికి వాళ్ల ఇష్టానికి వదిలేయటం తప్పేం కాదు. కానీ అదే అలవాటుగా మారకుండా చూడాలి.