ఎలా మాన్పించాలంటే..

31-10-2017: తమ పనులకు ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం పిల్లల చేతికి సెల్‌ ఫోన్లు ఇచ్చేసే తల్లితండ్రులు కొందరైతే, వాళ్ల మారాం భరించలేక సెల్‌ ఫోన్లను చేతికిచ్చి ఊరుకునే వారు మరింకొందరు. కామన్‌ సెన్స్‌ మీడియా సంస్థ జరిపిన పరిశోధనలో ఎనిమిదేళ్ల లోపు పిల్లలు రోజుకి కనీసం రెండు గంటల 19 నిమిషాల స్ర్కీన్‌ టైమ్‌ గడుపుతున్నారని తేలింది. ఈ స్ర్కీన్‌ టైమ్‌ కూడా మొబైళ్లకే పరిమితమవుతోంది. పిల్లల స్ర్కీన్‌ టైమ్‌ను పరిమితం చేయటం పెద్దలకు కాస్త కష్టమైన పనే అయినా, వారి ఏకాగ్రతను ఇతర అంశాల మీదకు మళ్లించే ప్రయత్నం మాత్రం మానుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఇందుకోసం, మాటల ద్వారా కాకుండా దృశ్యరూపంలో వాళ్లకి స్ర్కీన్‌ టైమ్‌ పరిధి అర్థమయ్యేలా చెప్పాలంటోంది. ఉదాహరణకు, దైనందిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ రాసేటప్పుడు ‘బెడ్‌ టైమ్‌’ ప్రదేశంలో కుటుంబంతో కలిసి భోజనం చేసే బొమ్మను అంటించాలంటోంది. అలాగే క్రీడల్లో, ఇతరత్రా యాక్టివిటీ్‌సలో పిల్లల ఆసక్తి రెట్టింపయ్యేలా పెద్దలు దగ్గరుండి వాళ్లని ఆడించాలని కూడా సూచిస్తోంది.