పసిడి మేని ఛాయకు

03-08-2017: స్నానం దగ్గర తీసుకునే జాగ్రత్తలు పిల్లల మేని ఛాయ మెరిసిపోయేందుకు దోహదం చేస్తాయి. స్నానానికి ముందు నువ్వుల నూనెతో మర్దన చేయడం, నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల చర్మ కాంతి రెట్టింపు అవుతుంది. మర్దన చేయడం చిన్నారుల శారీరక ఎదుగుదలకూ దోహదం చేస్తుంది.

తేనె తీసుకోవడం కూడా మేని ఛాయకు మేలు చేస్తుంది. తేనెలో ఉండే విటమిన్‌-బి చర్మం రంగును మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కొబ్బరి నీటితో ముఖం, శరీరాన్ని మర్దన చేయడం వల్ల మంచి రంగు వస్తుంది.

పళ్లు తింటే ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిది. కాస్త పెద్దపిల్లల్లో చర్మం పాలరంగు సంతరించుకోవాలంటే బొప్పాయి, అనాస పళ్లు పిల్లలకు తినిపిస్తుండాలి.

టీనేజ్‌లోకి వచ్చిన పిల్లలకు చర్మ సంబంధమైన సమస్యలు పెరుగుతుంటాయి. హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. పోషక విలువులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.