టీవీ ఎక్కువగా చూస్తే పిల్లలకు మధుమేహం

లండన్‌, జూలై 31: పిల్లలు రోజుకు మూడు గంటల కంటే ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయారా? అయితే, తల్లిదండ్రులూ.. జాగ్రత్త. అలా ఎక్కువసేపు పిల్లలు టీవీ ముందు కూర్చున్నా.. కంప్యూటర్‌లో వీడియోగేమ్స్‌ ఆడుతున్నా వారిలో మధుమేహం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం టీవీ చూడడం వల్ల ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గి, అనియంత్రిత జీవక్రియ, రక్తంలో అధిక గ్లూకోజ్‌తో టైప్‌-2 డయాబెటిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీలైనంత వరకు పిల్లల్ని టీవీలకు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.