ఆవుపాలు తాగితే పొడుగవుతారు!

26-6-2017: మీ పిల్లలు పొడుగ్గా, ఆజానుబాహులుగా తయారవ్వాలని అనుకుంటున్నారా? అయితే వాళ్లకు ఇప్పటినుంచే ఆవుపాలు ఇవ్వడం మొదలుపెట్టండి. ఇతర జంతువుల పాలు తాగే పిల్లలు పొట్టిగా అవుతారని కెనడాకు చెందిన సెయింట్‌ మైఖేల్‌ ఆస్పత్రి పరిశోధనలో తేలింది. రోజుకు ఒక కప్పు ఆవుపాలు తాగేవారి కంటే... గేదెపాలు, వేరే పాలు తాగేవాళ్లు సగటు కంటే 0.4 సెంటీమీటర్ల ఎత్తు తక్కువగా ఉంటున్నారని వీళ్లు తేల్చారు. అదే ఆవుపాలు తాగితే సగటు కంటే 0.2 సెంటీమీటర్ల ఎత్తు ఎక్కువగా ఉంటున్నారని ఈ ఆస్పత్రికి చెందిన పిల్లల వైద్యుడు జొనాథన్‌ మాగైర్‌ చెప్పారు.