పిల్లలు తినటానికి పేచీ పెడితే...

24-10-2017: పిల్లలు ఇష్టంగా తింటుంటే తల్లి కడుపు నిండిపోతుంది. కానీ పిల్లలు తిండి దగ్గరే పేచీ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు తల్లులు ఈ చిట్కాలు పాటిస్తే సరి!

చక్కెర, మైదా కలిసిన జంక్‌ ఫుడ్‌ అందనివ్వకుండా చేస్తే పిల్లల ఆకలి పెరుగుతుంది. కాబట్టి వాటికి ఇంట్లో స్థానం కల్పించకండి.
ఆహారం తినటానికి రుచిగా ఉంటే సరిపోదు, చూడటానికి అందంగానూ కనిపించాలి. కాబట్టి బఠాణీ, క్యారెట్‌, ముల్లంగి....ఇలా రంగురంగుల పదార్థాలకు ఆహారంలో చోటు కల్పించండి. వీలైతే ఆ కూరగాయలను దగ్గరుండి పిల్లల చేతే శుభ్రం చేయుంచండి. అప్పుడు పిల్లలు తినటానికి ఆసక్తి చూపిస్తారు.
పళ్లు, కూరగాయలు, స్టీమ్‌డ్‌ వంటకాలు, నాన్‌ వెజిటేరియన్‌ ఐటమ్స్‌... వీటిలో ఏది తినాలనేది పిల్లలనే నిర్ణయించుకోనివ్వండి. ఆకలి లేకపోతే పిల్లలు తిండి జోలికే వెళ్లరు. అలాంటప్పుడు వెంటపడి, బలవంతంగా తినిపించకుండా వాళ్లకి ఆకలయ్యేవరకూ ఆగటం మేలు.