బ్లూబెర్రీతో పిల్లల్లో చురుకుదనం

లండన్‌, అక్టోబర్‌ 15: నేరేడు పండు తరహాలో ఉండే బ్లూబెర్రీతో పిల్లల్లో చురుకుదనం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 7-10 ఏళ్ల వయసు గల పిల్లలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారించామని ఇంగ్లండ్‌లో రీడింగ్‌ యూనివర్సిటీ పరిశోధకుడు విలియమ్స్‌ చెప్పారు. ఫ్లేవనాయిడ్స్‌ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ డ్రింక్‌ తాగిన పిల్లలో వేగం, కచ్చితత్వం పెరగడాన్ని గుర్తించామన్నారు. బ్లూబెర్రీ డ్రింక్‌ తాగని పిల్లలకు, తాగిన పిల్లలకు కంప్యూటర్‌లో ఓ టాస్క్‌ ఇచ్చామన్నారు. బ్లూబెర్రీ డ్రింక్‌ తాగనివారితో పోల్చితే తాగినవారు 9 రెట్లు వేగంగా టాస్క్‌ను పూర్తిచేశారని చెప్పారు.