లేటు వయసులో పుట్టే పిల్లల్లో ప్రవర్తనా లోపాలు

22-6-2017: ఆలస్యంగా కలిగే సంతానంలో తెలివితేటలు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఇతర విషయాలలో చూస్తే వారు వెనకబడి ఉంటున్నారని వివరించింది. తమ ఆలోచనలు, ఆసక్తులపైనే దృష్టి నిలిపి సమాజం గురించి ఆలోచించడంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతరులలాగా సమాజంలో కలిసిపోవడంలేదని తెలిపారు. ప్రవర్తనాపరంగా చూసినా వారి వయసుకు తగ్గట్టుగా ఉండట్లేదని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు తెలిపారు.