రొమ్ము కేన్సర్‌ చికిత్సకు కొత్త ఔషధం!

10-8-2017: మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను నిరోధించే కొత్త అణువును కనుగొన్నారు టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ పరిశోధక బృందంలో భారత సంతతికి చెందిన గణేష్‌ రాజ్‌ కూడా ఉన్నారు. ఇప్పటివరకు రొమ్ము కేన్సర్‌ చికిత్సకు హార్మోన్‌ థెరపీ వంటి సాంప్రదాయ పద్ధతులను మాత్రమే ఉపయోగిస్తున్నారు. వాటికి కూడా లొంగని రొమ్యు కేన్సర్‌ కణాలను ఈ కొత్త అణువును కలిగిన ‘ఈఆర్‌ఎక్స్‌-11’ ద్వారా  తొలగించవచ్చని గణేష్‌ తెలిపారు. ఈస్ట్రోజన్‌ గ్రాహక కేన్సర్‌ కణాలను ఈ అణువు టార్గెట్‌ చేస్తుందని చెప్పారు. ఈ ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించామని తెలిపారు.