పొట్ట కొవ్వుతో కేన్సర్‌ ముప్పు ఎక్కువ!

వాషింగ్టన్‌,27-8-2017: పొట్టభాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతోం దా..? ఎక్కువగా లేకపోతే ఇబ్బంది లేదుగానీ.. పొట్ట, నడుము భాగంలో కొవ్వు ఎక్కువైతే ప్రమాదమే అంటున్నారు అమెరికా మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. అలాంటి వారికి కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. కేన్సర్‌కు ఊబకాయం కూడా ఓ కారణమని పరిశోధకులు చెబుతున్నా, అది ఎలాను పరిశోధకులు తేల్చి చెప్పలేకపోయారు. శరీరంలోని కొవ్వు నుంచి విడుదలయ్యే ఫైబ్రోబ్లాస్ట్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌-2 (ఎఫ్‌జీఎఫ్‌) అనే ప్రొటీన్‌.. సాధారణ కణాలను కూడా కేన్సర్‌ కణాలుగా మార్చేస్తోందని తాజాగా గుర్తించారు.