చర్మ కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించే కృత్రిమ మేధస్సు

24-08-2017: పుట్టుకురుపు లాంటి చర్మకేన్సర్‌ను తొలినాళ్లలోనే గుర్తించే కృత్రిమ మేధస్సును కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చర్మంపై ఉన్న పుండ్ల చిత్రాలను విశ్లేషించి ముందుగానే వ్యాధిని గుర్తించే ఈ వ్యవస్థతో రోగం ముదరకముందే సరైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10వేల చర్మానికి సంబంధించిన చిత్రాలను ఉపయోగించి ఈ వ్యవస్థను రూపొందించామన్నారు.