బి3 విటమిన్‌తో చర్మ కేన్సర్‌కు చెక్‌!

12-08-2017: ప్రమాదకరమైన చర్మ కేన్సర్‌ ‘మెలనోమా’ చికిత్సకు విటమిన్‌ థెరపీ సమర్థంగా పనిచేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ‘విటమిన్‌ బి3’ ఉపయోగించి ‘మెలనోమాను’ అరికట్టవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ పరిశోధకులు కనుగొన్నారు. యూవీ కిరణాల వల్ల చర్మం ఇన్ఫెక్షన్‌కు గురి కాకుండా, డీఎన్‌ఏ దెబ్బతినకుండా విటమిన్‌ బి3లోని ‘నికోటినమైడ్‌’ అడ్డుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. రోజుకు ఒక గ్రాము చొప్పున నికోటినమైడ్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.