‘ఏక వర్ణ’ రక్తపరీక్ష!

కేన్సర్‌ వృద్ధిని గుర్తించే సులువైన పరీక్ష
ల్యాబ్‌లో ఎవరైనా చేసుకునే వెసులుబాటు

15-08-2017: మామూలుగా కేన్సర్‌ ముదిరితే తప్ప బయటపడే అవకాశాలు చాలా తక్కువ. ఆదిలోనే ఆ మహమ్మారిని కనుక్కోవడం కొంచెం కష్టమైన పనే. అయితే కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే రక్ష పరీక్షను అభివృద్ధి చేశామంటున్నారు అమెరికా స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. కేన్సర్‌ కణాల అభివృద్ధి, వ్యాప్తిని తమ పరీక్ష ద్వారా సులువుగా కనిపెట్టవచ్చంటున్నారు. ఆ పరీక్ష ‘ఏక వర్ణ డిజిటల్‌ పీసీఆర్‌ (పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌)’! ఈ పరీక్ష ద్వారా కేన్సర్‌ కణాలు విడుదల చేసిన అతిచిన్న డీఎన్‌ఏల్లోని జన్యు పరివర్తనాలను సులువుగా గుర్తించవచ్చని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హాన్లీ పీ జి చెప్పారు. ప్రతి చెక్‌పలోనూ అప్పటికప్పుడే రోగిలోని కేన్సర్‌ కణాల వృద్ధి, వ్యాప్తిని తెలుసుకోవచ్చన్నారు. ఈ పరీక్షను సాధారణ లేబొరేటరీల్లోనూ చేయవచ్చని, నిపుణుల పర్యవేక్షణ అవసరం లేకుండానే ఎవరైనా సులువుగా పరీక్ష చేసుకోవచ్చని పరిశోధకులు వివరించారు. తాము అభివృద్ధి చేసిన రక్త పరీక్ష కేన్సర్‌ రోగులకు ఓ వరం అంటున్నారు.