స్ఖలనంతో ప్రొస్టేట్‌ కేన్సర్‌ దూరం

12-11-2017: వీర్య స్ఖలనం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆస్ట్రేలియా వైద్యులు. వీర్య స్ఖలనంతో పురుషుల్లో వచ్చే ప్రాణాంతక వీర్యగ్రంథి కేన్సర్‌ను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో వచ్చే చాలా రోగాలను కూడా అడ్డుకోవచ్చని చెబుతున్నారు. వారిలో ఈ కేన్సర్‌ వచ్చే అవకాశాలు 22 శాతం తగ్గుతాయని తెలిపారు. 20ల్లో ఉన్న యువకులు నెలకు కనీసం 21సార్లు వీరాన్ని స్ఖలిస్తే 19శాతం ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వెల్లడించారు. 70 ఏళ్లకంటే తక్కువ ఉన్న వాళ్లు వారానికి 4 నుంచి 7సార్లు స్ఖలిస్తే 36 శాతం కేన్సర్‌ ముప్పు తగ్గినట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఓ అధ్యయనం పేర్కొంది. అయితే, స్ఖలనానికి, ప్రొస్టేట్‌ కేన్సర్‌కు మధ్య లింకు స్పష్టంగా తెలీదని వెల్లడించింది. ఇక, వారానికి నాలుగు అంతకంటే తక్కువ సార్లు స్ఖలించే పురుషుల్లో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించామని తెలిపింది. కాగా, ఈ పద్ధతి వ్యసనమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూనే.. ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.