రొమ్ము కేన్సర్‌కు సరికొత్త ఔషధం

19-08-2017: రొమ్ము కేన్సర్‌ వ్యాధి చికిత్సకు ఉపయోగపడే సమర్థవంతమైన అణువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్మోన్‌ థెరపీ లాంటి సంప్రదాయ చికిత్సలతో లాభం లేక ఇబ్బంది పడుతున్న రోగులకు ఈ ఔషధం ఉపయుక్తంగా పనిచేస్తుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సౌత్‌ వెస్టర్న్‌ సిమన్స్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఈఆర్‌ఎక్స్‌-11 అనే కొత్త అణువుతో ప్రత్యేక విధానం ద్వారా రొమ్ముల్లో కేన్సర్‌ కణితులను తొలగించవచ్చని తెలిపింది.