కేన్సర్‌ కణాలను నాశనం చేసే నానోమిషన్‌

03-09-2017: కేన్సర్‌ కణాల పొరలపై రంధ్రం చేసి వాటిని నాశనం చేసే నానోమిషన్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అతినీలలోహిత కాంతి సాయంతో నడిచే యాంత్రిక పరిభ్రమణ సూక్ష్మ అణువులు 60 సెకన్లలోనే కేన్సర్‌ కణాలపై రంధ్రం చేసి వాటిని చిన్నాభిన్నం చేస్తాయట. ఇలా ప్రొస్టేట్‌ కేన్సర్‌ కణాలను నాశనం చేయగలిగామని బ్రిటన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అన్ని రకాల కేన్సర్లను నానోమిషన్‌తో తొలగించేలా పరిశోధనలు చేస్తున్నామని పేర్కొన్నారు.