కేన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకునే ఔషధం

06-08-2017: కేన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకునే కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ యాంటీ కేన్సర్‌ ఏజెంట్‌ కణవృద్ధిని పెంచే ఫాస్ఫోనోసిటైడ్‌ 3-కినా్‌స(పీఐ3కే) పనితీరును అడ్డుకుంటుందట. కణితులను ప్రోత్సహించే రెటినాయిడ్‌ ఎక్స్‌ రిసెప్టార్‌- ఆల్ఫా(టీఆర్‌ఎక్స్‌ఆర్‌ఏ) ప్రొటీన్‌ను కె-80003 ఔషధం గట్టిపరిచి పీఐ3కే ఉత్తేజిత మార్గాన్ని అడ్డుకుంటుందని అమెరికాలోని సాన్‌ఫర్డ్‌ బర్న్హమ్‌ ప్రెబీస్‌ మెడికల్‌ డిస్కవరీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు.