విటమిన్‌-బీ ఎక్కువైతే ఊపిరితిత్తుల కేన్సర్‌

24-08-2017: మోతాదుకు మించి విటమిన్‌ బీ6, బీ12 ఎక్కువ కాలం తీసుకుంటే పురుషుల్లో ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జీవక్రియను మెరుగుపర్చడానికి, బలం పెంచేందుకు విటమిన్‌-బీని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అయితే, పొగ తాగే పురుషులు రోజుకు 20మిల్లీగ్రాముల బీ6, 55మిల్లీగ్రాముల బీ12 కంటే ఎక్కువ మోతాదులో 10ఏళ్ల పాటు తీసుకుంటే కేన్సర్‌ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువవుతుందని అమెరికాలోని ఓహియో స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు.