బీరు ఎక్కువైతే పేగు కేన్సర్‌

09-09-2017: నిత్యం పరిమితికి మించి బీరు తాగటం, హాట్స్‌ డాగ్స్‌, బేకన్స్‌ లాంటివి తినటం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారానికి 500 గ్రాములకు మించి పంది మాంసం, బీఫ్‌ తింటే కూడా ఈ కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందని, ఊబకాయం, అధికబరువు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాధి ప్రమాదం తగ్గడానికి బ్రౌన్‌ రైస్‌, గోధుమ రొట్టెలు తినాలని అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌, అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన నిధి సంస్థలు సూచిస్తున్నాయి.