సెకండరీ కేన్సర్‌ను గుర్తించే జన్యు పరీక్ష

25-10-2017: రొమ్ము కేన్సర్‌ బారిన పడిన మహిళల్లో వ్యాధి తీవ్రత పెరిగి, ఇతర అవయవాలకు పాకేందుకు సహకరించే జన్యువును గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షను ఇంగ్లండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ఎంఏఎఫ్‌’ అనే జన్యువులు తక్కువగా ఉండే మహిళల్లో రొమ్ము కేన్సర్‌.. ఎముకల వరకు వ్యాపించి కణుతులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందని పేర్కొన్నారు. రొమ్ము కేన్సర్‌ బారిన పడిన మహిళల్లో ఈ జన్యువు ఉన్నదీ లేనిదీ ప్రత్యేక పరీక్ష చేసి కనుగొనవచ్చని చెప్పారు. ఈ పరీక్ష ద్వారా ఎంఏఎఫ్‌ జన్యువు తక్కువగా ఉందని గుర్తించిన వారిలో ఎముకులు గట్టిపడి, కణుతులు ఏర్పడకుండా ఉండేందుకు చికిత్స చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.