యాంటాసిడ్లతో కేన్సర్‌ ముప్పు

02-11-2017 బీజింగ్‌: చాతీలో మంట అనిపిస్తే చేతికందిన యాంటాసిడ్‌ తీసుకుని వాడేస్తుంటాం. అల్సర్లు తగ్గేందుకు కూడా యాంటాసిడ్లనే ఉపయోగిస్తుంటాం. అయితే.. ఈ యాంటాసిడ్లు ఎక్కువగా వాడే వారికి జీర్ణాశయ కేన్సర్‌ ముప్పు పొంచి ఉంటుందని హాంకాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలోని హెచ్‌-పైలోరీ అనే బ్యాక్టీరీయాని యాంటాసిడ్లలో ఉండే ప్రొటీన్‌ పంప్‌ ఇన్‌హిబిటర్లు(పీపీఐ) నాశనం చేస్తాయని వారు చెప్పారు. పేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియాను నాశనం చేస్తే జీర్ణాశయ కేన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందన్నారు. అయితే.. ఎక్కువ కాలంపాటు యాంటాసిడ్లు ఉపయోగిస్తే జీర్ణాశయ కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందని తమ అధ్యయనం ద్వారా తేలిందన్నారు. యాంటాసిడ్లను ఎంత ఎక్కువ కాలం వాడితే కేన్సర్‌ వచ్చే ప్రమాదం అంత ఎక్కువ ఉంటుందన్నారు.