26-10-2017: శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసే స్వీయ నియంత్రణ కలిగిన సూక్ష్మ అణువుల(నానో పార్టికల్స్)ను ఇంగ్లండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే థర్మోథెరపీకి ఈ సూక్ష్మ అణువులు ఉపయోగపడతాయన్నారు. సాధారణంగా థర్మోథెరపీ చేసేటప్పుడు ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యంకాదని అన్నారు. ఇటువంటప్పుడు కేన్సర్ కణాలతోపాటు శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు కూడా నాశనమవుతుంటాయన్నారు. తాము అభివృద్ధి చేసని ఈ సూక్ష్మ అణువులు 45 డిగ్రీలు చేరుకున్నాక వాటంతటవే నియంత్రించుకుంటాయని వివరించారు.