శీతల ప్రాంతీయులకు కేన్సర్‌ ముప్పు

జెరూసలెం, డిసెంబరు 10: తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నివసించే వారిలో కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేన్సర్‌ కేసుల్లో నార్వే, డెన్మార్క్‌ వంటి శీతల దేశాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయని సిప్రస్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఎత్తైన ప్రదేశాల్లో నివసించే వారికీ ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటోందని అధ్యాయకులు తెలిపారు.