రాత్రివేళ పనిచేసే మహిళలూ...జర జాగ్రత్త

19-08-2017: నైట్ షిప్టుల్లో పనిచేసే మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారని హార్వర్డ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాత్రివేళ పనిచేస్తున్న మహిళలు హార్మోన్ ల మార్పుల వల్ల ట్యూమర్లు ఏర్పడతాయని పరిశోధకులు తేల్చారు. పారిశ్రామికీకరణ వల్ల రాత్రివేళ విద్యుత్ బల్బుల కాంతిలో పనిచేయడం వల్ల మహిళలు అధికంగా రొమ్ము కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని హార్వర్డ్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసరు పీటర్ జేమ్స్ చెప్పారు. మానవ మెదడులో ఉత్పత్తి అవుతున్న మెలటోనిన్ అనే హార్మోన్ రొమ్ము కేన్సర్ ట్యూమర్లు పెరగడానికి కారణమవుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. 1,10,000మంది మహిళల డేటాను అధ్యయనం చేయగా రాత్రివేళ పనిచేస్తున్న మహిళల్లో రొమ్ము కేన్సర్ బారిన పడిన వారి సంఖ్య అధికంగా ఉందని తేలింది. అందుకనే నైట్ షిఫ్టులో పనిచేస్తున్న మహిళలూ పారాహుషార్.